Ads
మామూలుగా సోషల్ మీడియాలో చాలామంది తాము అనుకుంటున్న విషయాలని బహిరంగంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు. వాటిలో కొన్ని బయట మాట్లాడటానికి సంకోచించే విషయాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియాలో ఉండే సెలబ్రిటీల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా బయటికి వెళ్లినప్పుడు సీసీ కెమెరాలు ఎలాగైతే మన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయో, అలాగే కొంత మంది నెటిజన్లు కూడా తమకు ఇష్టమైన సెలబ్రిటీ చేసిన ప్రతి పోస్ట్, చేసిన అప్డేట్స్, పెట్టిన స్టోరీస్ ని అబ్జర్వ్ చేస్తారు.
Video Advertisement
అందులో కొన్ని వారికి అంతగా నచ్చకపోతే నచ్చలేదు అని కూడా కామెంట్ చేస్తారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఏ విషయం పైన అయినా కావచ్చు. కొంత మంది సెలబ్రిటీలు దీనికి రెస్పాండ్ అవుతే, ఇంకొంత మంది సెలబ్రిటీలు మాత్రం పెద్దగా పట్టించుకోరు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎన్నోసార్లు సోషల్ మీడియా చర్చల్లో నిలిచారు. కొన్ని సందర్భాల్లో రెస్పాండ్ అయ్యారు. ఇంకొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో సమంత “నాకు కాంట్రవర్సీ లకి చాలా దగ్గర రిలేషన్ షిప్ ఉంది” అని సరదాగా అన్నారు.
జనవరి 26 వ తేదీన సమంత తన ఇంస్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ద్వారా ఫాలోవర్స్ తో మాట్లాడారు. అందులో తన ఫాలోవర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనకి ఇప్పటివరకు నచ్చిన రోల్ ఏంటి అని అడగగా, “ఓ బేబీ, ఫ్యామిలీ మాన్” అని అన్నారు.
ట్రోలింగ్ కి ఎలా రియాక్ట్ అవుతారో అని మరొక ఫాలోవర్ అడగగా, అందుకు సమంత “ఇప్పుడైతే నేను వాటిని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతకు ముందు మాత్రం అవి నన్ను చాలా ఎఫెక్ట్ చేసేవి. కానీ ఇప్పుడు నవ్వొస్తుంది. బహుశా, మనిషిగా నాలో చాలా మార్పు వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏమో” అని జవాబిచ్చారు.
End of Article