Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సమంత నర్తిస్తున్నారు అంటూ తాజాగా పుష్ప యూనిట్ ప్రకటించింది. దీనితో.. ఈ విషయం నెట్టింట్లో చర్చనీయాంశం అయింది.
ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అయితే ఈ పాట కోసం సమంత కొన్ని కండిషన్లని పెట్టినట్లు సమాచారం. మొదట ఈ పాటని సిటీలోని ఒక స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించాలి అనుకున్నారు. కానీ సమంత రామోజీ ఫిలిం సిటీకి లొకేషన్ మార్చమని అడిగారు. అందుకు కారణం సమంతకి మీడియా ముందుకు రావడానికి ఆసక్తి లేకపోవడమే అని సమాచారం. అంతే కాకుండా విడాకుల తర్వాత సమంత నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. దాంతో భావోద్వేగానికి లోనవుతే కష్టం అని, సమంతకి కొంచెం స్పేస్ కావాలి అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సుకుమార్ కి చెప్తే సుకుమార్ కూడా సరే అన్నారట.
End of Article