Ads
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. సమంత గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ద్వారా ఎన్నో కోట్స్ షేర్ చేస్తున్నారు.
Video Advertisement
సమంత ఇటీవల చేసిన ఒక పోస్ట్ చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, సమంత ఇటీవల తన పెంపుడు జంతువులు ఆడుకుంటున్న వీడియో ఒకటి తీసి పోస్ట్ చేశారు. అలాగే తన వర్కౌట్ కి సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సమంత, నాగ చైతన్య అంతకుముందున్న ఇంట్లోనే సమంత ఉంటున్నారు అనే విషయం నెటిజన్లకి అర్థమైపోయింది. దాంతో, “అదేంటి విడిపోయిన తర్వాత కూడా సమంత అదే ఇంట్లో ఉంటున్నారు? వేరే ఇల్లు షిఫ్ట్ అవుతారు అనే వార్తలు వచ్చాయి కదా?” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article