పాట విని ఎమోషనల్ అయిన సమంత..! “ఇంకా మర్చిపోలేదా..?” అంటూ కామెంట్స్..!

పాట విని ఎమోషనల్ అయిన సమంత..! “ఇంకా మర్చిపోలేదా..?” అంటూ కామెంట్స్..!

by kavitha

Ads

విజయ్‌ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు హిట్ అవడంతో ఈ చిత్రం పై అంచనాలు పెరిగాయి.

Video Advertisement

రీసెంట్ గా నిర్వహించిన ఖుషి మూవీ మ్యూజికల్‌ కన్సర్ట్‌ కూడా సక్సెస్ అయ్యింది. ఈ కన్సర్ట్‌ విజయ్‌ దేవరకొండ, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు స్టేజీ మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడున్నవారంతా వారి డ్యాన్స్‌ ను ఎంజాయ్‌ చేశారు. అయితే మజిలీ పాటతో సమంత ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి మూవీలో కనిపించారు. కానీ హీరో హీరోయిన్లుగా కాదు. ఖుషిలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్‌, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్యక్రమంలో సింగర్స్‌ పాటలు పాడి, ప్రేక్షకులను అలరించారు. అయితే మజిలీ మూవీ పాటకు సమంత ఎమోషనలైనట్లుగా తెలుస్తోంది. స్టేజీపై సింగర్‌ ప్రియతమా పాటను పాడుతున్న టైమ్ లో సమంత భావోద్వేగానికి లోనైంది. గత జ్ఞాపకాలు ఆ పాట ద్వారా గుర్తుకు రావడంతో వస్తున్న కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించిందని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా అయ్యింది. ఆ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్ ఆమె పరిస్థితి పై జాలి పడుతున్నారు. కొందరు కాలమే సమంత బాధను నయం చేస్తుందంటున్నారు.
మరికొందరు అభిమానులు సమంతను అలా చూస్తుంటే తమకు కూడా ఏడుపు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మజిలీ మూవీలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటించారు. వీరి పెళ్లి జరిగిన తరువాత కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.

https://twitter.com/Sravanthi_Sam/status/1691801560609681677?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1691801560609681677%7Ctwgr%5E009b40df5028e4c4f9c749194f71d8fed0328b0c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fsamantha-gets-emotional-while-listening-majili-song-1738842

Also Read: “గాండీవధారి అర్జున” సెన్సార్ టాక్..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like