“అప్పుడు మహేష్ చేస్తే తప్పు…ఇప్పుడు నువ్వు చేస్తే ఒప్పా.?”…అంటూ సమంతపై ఫైర్ అవుతున్న మహేష్ ఫాన్స్.!

“అప్పుడు మహేష్ చేస్తే తప్పు…ఇప్పుడు నువ్వు చేస్తే ఒప్పా.?”…అంటూ సమంతపై ఫైర్ అవుతున్న మహేష్ ఫాన్స్.!

by Mohana Priya

Ads

పుష్ప సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇది అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సినిమాకి సంబంధించి ప్రతి చిన్న విషయంలో అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు.

Video Advertisement

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాటపై ట్రోలింగ్ మొదలయ్యింది. మగవాళ్లని తిడుతున్నట్టుగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమంత చేసిన ఒక పాత ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

1 నేనొక్కడినే సినిమా టైమ్‌లో సమంత, మహేష్ బాబు వెనకాల కృతి సనన్ ఉన్న ఒక పోస్టర్ ని ఉద్దేశించి, అది కించపరిచేలా ఉంది అని ట్వీట్ చేసారు. దాంతో అదే కామెంట్‌కి ఇప్పుడు రిప్లై ఇస్తూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. అందులో ఒకరు, “నేను ఇప్పుడే ఒక రాబోయే తెలుగు సినిమాలోని పాట చూసాను అది రిగ్రెసివ్ గా ఉంది” అని 1 నేనొక్కడినే సినిమా టైమ్‌లో సమంత చేసినట్టే ట్వీట్ చేసారు. ఇది మాత్రమే కాదు ఇంకా చాలా మంది, “అపుడు ఆ స్టిల్ అభ్యంతరకరంగా అనిపించినప్పుడు, ఇప్పుడు ఈ పాట కూడా అలానే ఉంది కదా? దీనిపై ఎందుకు మాట్లాడలేదు” అని కామెంట్స్ చేస్తున్నారు.

 


End of Article

You may also like