Home Filmy Adda అప్పుడు… ఇప్పుడు..! “సమంత” మాటల్లో ఈ తేడా గమనించారా..?

అప్పుడు… ఇప్పుడు..! “సమంత” మాటల్లో ఈ తేడా గమనించారా..?

by Mohana Priya

సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. సమంతని తెలుగు తెరపై చూసి చాలా కాలం అయ్యింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కానీ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో యశోద సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉన్న సినిమా అని అర్థం అవుతుంది. సినిమాలో స్టార్టింగ్ లో మొత్తం అసలు ఏం జరుగుతోంది అని అర్థం కాకుండా నడుస్తుంది. ఇదిలా ఉండగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేదు. అందుకు సంబంధించిన కారణాన్ని కూడా సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

samantha about her health problem..

సమంత తాను మైయోసైటిస్ తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అని చెప్పారు. సమంత ప్రమోషన్స్ మొత్తానికి కలిపి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒకటి తెలుగులో ఇచ్చారు. ఒకటి తమిళ్ లో ఇచ్చారు. తెలుగులో సుమతో ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పాత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన సినిమా ఏ మాయ చేసావే గురించి చెప్తున్నారు. అప్పుడు సమంత చాలా సంతోషంగా ఉన్నారు.

samantha old interview in 2010 and recent interview difference

అది సమంత ముఖంలోనే తెలుస్తోంది. కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాటల్లో చాలా తేడా కనిపిస్తోంది. మనుషులు మారడం సహజమే. కానీ సమంత ఇప్పుడు మాట్లాడిన మాటలు చాలా మందికి ఎమోషనల్ గా అనిపించాయి. ఈ వీడియో కింద ఒక నెటిజన్, “జీవితంలో గెలుపులు ఆనందాన్ని ఇస్తాయి… ఓటములు అనుభవ జ్ఞానాన్ని ఇస్తాయి…! ఆనందం ఉండేది కొంతసేపటి వరకే.. కానీ అనుభవం ఇచ్చే జ్ఞానం జన్మ జన్మలకి మనతోనే ఉంటుంది…!” అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video:

You may also like