Samantha : స్టైలిస్ట్ తో వైరల్ అవుతున్న “సమంత” ఫోటో..!

Samantha : స్టైలిస్ట్ తో వైరల్ అవుతున్న “సమంత” ఫోటో..!

by Sunku Sravan

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జోరు పెంచింది. డైవర్స్ అవ్వగానే కొంత టైం తీసుకున్న సమంత ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం విడుదలయింది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. పనిలో పని గా పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు మార్గం వేసుకుంటుంది.

Video Advertisement

ఒక పక్క సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. దాంట్లో భాగంగానే సమంత ప్రస్తుతం ముంబైలో ఇల్లు కొని అక్కడే నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. పైగా బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తుండడంతో సమంత తన మకాం ముంబైకి మార్చిందట.

samantha 1

సమంత నిత్యం సోషల్ మీడియాలో ఉంటుంది. వాటి ద్వారా తనకు సంబంధినచిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. సమంత తరచుగా తన ఫోటోస్, ఇంటరెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తోంది. జిమ్ వర్కౌట్స్, తన ఇంట్లో ఉన్న పెట్స్ అల్లరిని అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉండగా సమంత తాజాగా ఊహించని షాక్ ఇచ్చింది.

Samantha with Preetham

Samantha with Preetham

తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో కలసి సామ్ డేట్ నైట్ కి వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో వీరిద్దరితో పాటు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా ఉంది. ఈ ఫోటోలని స్వయంగా సమంత డేట్ నైట్ అంటూ కషన్ పెట్టె సరికి ఫ్యాన్స్ కి ఊహించని షాక్ గా మారింది. సమంత, ప్రీతమ్ లు బెస్ట్ ఫ్రెండ్స్. అయినప్పటికీ చైతుతో బ్రేకప్ సమయంలో ప్రీతమ్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ ని సామ్, ప్రీతమ్ ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సామ్ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి వర్క్ పై ఫోకస్ పెడుతోంది. ఇలా సరదాగా వీరు ముగ్గురూ డేట్ నైట్ కి వెళ్లిన పిక్స్ షేర్ చేశారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

samantha

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన యశోద చిత్రం ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించబోతోంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ ‘శాకుంతలం’ చిత్రంలో కూడా నటించింది. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ పౌరాణిక చిత్రంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.


You may also like