Home Filmy Adda షాప్ ఓపెనింగ్ కోసం “సమంత” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

షాప్ ఓపెనింగ్ కోసం “సమంత” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by Mohana Priya

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

samantha remuneration for a shopping mall inauguration

ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అలాగే సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయింది. ఇటీవల సమంత ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి హాజరయ్యారు. ఇందుకోసం సమంత చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఫంక్షన్ కోసం సమంత 15-20 లక్షల రూపాయలను తీసుకున్నారట.

samantha remuneration for a shopping mall inauguration

మాములుగా స్టార్ హీరోయిన్స్ అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోరు. కానీ సమంత చిన్న హీరోయిన్స్ తీసేసుకునే అంత తక్కువ మొత్తం తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత యశోద అనే సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అలాగే మరి కొన్ని సినిమాలు కూడా డిస్కషన్ దశలో ఉన్నాయి. వీటిలో యశోద సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. ఇందులో సమంత ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారు అని సమాచారం. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

You may also like