Ads
కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. షూటింగ్ అవుట్ డోర్ అవ్వడంతో, ఈ వారం బిగ్ బాస్ హోస్టింగ్ కి రాలేకపోయారు నాగార్జున. హోస్ట్ స్థానాన్ని సమంత భర్తీ చేశారు. మాములుగా అయితే శనివారం, ఆదివారం నాగార్జున వస్తారు. కానీ ఈ సారి మాత్రం కేవలం ఆదివారం ఒక్క రోజు మాత్రమే సమంత హోస్ట్ బాధ్యతను తీసుకున్నారు.
Video Advertisement
అంతే కాకుండా ఆదివారం పండగ కూడా కావడంతో బిగ్ బాస్ దాదాపు మూడు గంటలు ప్రసారం అయ్యింది. ఇప్పటి వరకు మనల్ని తన నటనతో అలరించిన సమంత, బిగ్ బాస్ షో ద్వారా హోస్ట్ గా కూడా ఎంటర్టైన్ చేశారు. కంటెస్టెంట్స్ గురించి చెప్పి అలాగే కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు సమంత.
సమంత హోస్టింగ్ ఎలా ఉంది అనే విషయం పై సోషల్ మీడియాలో ఒక పోల్ నిర్వహించగా, 74 శాతం నెటిజన్లు బాగుంది అని వోట్ చేశారు. ఆలా సమంత తనలో ఉన్న మరొక టాలెంట్ కూడా చూపించారు. అయితే సమంత బిగ్ బాస్ హోస్టింగ్ కి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.ఏది ఏమైనా ఇది ప్రొఫెషన్ కి సంబంధించిన విషయం కాబట్టి, సమంత కూడా ఈ విషయాన్నీ అంతే ప్రొఫషనల్ గా డీల్ చేశారు. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే నాగార్జున రెండు ఎపిసోడ్స్ కి తీసుకునే మొత్తాన్ని సమంత కి చెల్లించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కారణంగా, ఆరు ఎపిసోడ్స్ వరకు షో కి దూరంగా ఉండబోతున్నట్లు వార్త వచ్చింది. ఒక వేళ అదే నిజమైతే నెక్స్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ కి కూడా హోస్టింగ్ బాధ్యతను సమంత తీసుకుంటారా? లేదా వేరే ఎవరైనా వస్తారా? ఇవన్నీ తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.
End of Article