Home Filmy Adda Samantha: పుష్ప “ఐటమ్ సాంగ్” రెస్పాన్స్‌పై స్పందించిన సమంత..!

Samantha: పుష్ప “ఐటమ్ సాంగ్” రెస్పాన్స్‌పై స్పందించిన సమంత..!

by Mohana Priya

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ఇటీవల విడుదల అయ్యింది. ఊ అంటావా ఊ ఊ అంటావా అనే ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు.

samantha responds on pushpa oo antava song

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, ఈ పాటపై ట్రోలింగ్ మొదలయ్యింది. మగవాళ్లని తిడుతున్నట్టుగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాట గురించి సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పాటలోని ఒక స్టిల్ షేర్ చేసిన సమంత, తను అప్పటి వరకు ఎన్నో రకమైన పాత్రలని చేసానని, ఇలా స్పెషల్ సాంగ్ చేయడం ఇదే మొదటిసారి అని, పాటని ఇంత ఆదరించినందుకు అందరికి థాంక్యూ చెప్పారు. సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందు సమంత ఈ పాట చేయడానికి ఒప్పుకోలేదు అని, తర్వాత ఇలా స్పెషల్ సాంగ్ చేసిన స్టార్స్ గురించి, అలాగే రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం గురించి చెప్పాను అని చెప్పారు.

You may also like