Home Filmy Adda Samantha : సమంత ముంబై షిఫ్ట్ అవుతుందా.? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.!

Samantha : సమంత ముంబై షిఫ్ట్ అవుతుందా.? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.!

by Mohana Priya

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.samantha answers to how she responds on trolling

ఇవి మాత్రమే కాకుండా నాగార్జున బర్త్ డే పార్టీకి సమంత హాజరు అవ్వకపోవడం, సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ కూడా పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. సమంత ప్రారంభించిన సాకీ క్లోతింగ్ బ్రాండ్ మొదలయ్యి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ సమంతని, “మీరు నిజంగానే ముంబైకి వెళ్ళిపోతున్నారా?”  అని అడిగారు.samantha about shifting to mumbai

అందుకు సమంత, “ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఎలా అయితే కొన్ని పుకార్లు వచ్చాయో అదే విధంగా ఇది కూడా వచ్చింది. కానీ నేను ముంబై కి షిఫ్ట్ అవ్వట్లేదు. ఇది కేవలం ఒక పుకారు మాత్రమే. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. ఇప్పటికీ ఎప్పటికీ హైదరాబాద్ నా ఇల్లు. హైదరాబాద్ నాకు అన్నీ ఇచ్చింది. నేను ఇక్కడే సంతోషంగా ఉంటాను” అని చెప్పారు.

You may also like