Home Filmy Adda Samantha : “ఊ అంటావా” మీమ్స్ పై సమంత ఏమన్నారంటే..?

Samantha : “ఊ అంటావా” మీమ్స్ పై సమంత ఏమన్నారంటే..?

by Mohana Priya

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.

ఈ సినిమాలో ఐటెం సాంగ్ “ఊ అంటావా మావ.. ఊహు అంటావా..” కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటకి సమంత నర్తించడంతో మరింతగా రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

samantha shared a meme on oo antava song

ఈ పాటపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి. ఈ మీమ్స్ సమంత దృష్టిలో కూడా పడింది. అలా ఒక మీమ్ సమంత సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో ఒక పాత పాటకి ఊ అంటావా పాట సింక్ చేసి ఎడిట్ చేసారు. స్మైలీ ఎమోజీస్ తో సమంత వీడియో షేర్ చేసారు.

You may also like