Ads
-
- చిత్రం: జాను
- నటీనటులు: సమంత, శర్వానంద్ తదితరులు
- నిర్మాత: దిల్ రాజు – శిరీష్
- దర్శకత్వం: ప్రేమ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: మహేందిరన్ జయరాజ్
- మ్యూజిక్: గోవింద్ వసంత
- ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
- రన్ టైం: 2 గంటల 30 నిముషాలు
- విడుదల తేదీ: ఫిబ్రవరి 7, 2020
కథ:
స్కూల్ డేస్ లో ప్రతి ఒక్కరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. కొన్ని సక్సెస్ అవుతాయి. కొన్ని ఫెయిల్యూర్ గా మిగిలిపోతాయి. మరికొంతమంది ప్రేమ ఐతే వారు ప్రేమించేవారికి కూడా తెలీకుండా ఆగిపోతుంది. అలా స్కూల్ డేస్ లో ఇష్టపడి ఒకరికి ఒకరు చెప్పుకోకుండా విడిపోయిన రామ్(శర్వానంద్) – జాను(సమంత)లు దాదాపు 17 ఏళ్ళ తర్వాత స్కూల్ గెట్ టుగెదర్ లో కలుసుకుంటారు. కప్పుడు ప్రాణంగా ప్రేమించిన మనిషి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన ముందుకు వస్తుందని రామ్ ఎలాంటి అనుభూతి పొందాడు. ఆ ఈవెంట్ అయ్యాక జానుతో రామ్ ఏం చేశాడు..? రామ్ జానకిని ఎలా మిస్సయ్యాడు..? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.Video Advertisement
విశ్లేషణ:
టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమాకి కీలకం జాను పాత్రే అని.. చైల్డ్ హుడ్ జానుగా గౌరీ గీత కిషన్ చేస్తే, యంగ్ జానుగా సమంత చేసింది. స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. మిగిలిన సినిమా మొత్తం సమంత క్రెడిట్ కొట్టేసింది. శర్వా, సమంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే సినిమా మొత్తం వీరిద్దరి పాత్రలే ఎక్కువగా కనిపించడం.. అక్కడక్కడ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. అయితే దర్శకుడు తనకు పట్టున్న లవ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా ప్రతిభ కనబరిచాడు.చిన్నప్పటి పాత్రల్లో చేసిన నటులు గౌరీ – సాయి కిరణ్ లు సమంత – శర్వానంద్ లు దగ్గరగా ఉండడం వలన తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. చాలావరకు సినిమా ఈ నలుగురి చుట్టే తిరుగుతుంది. మిగతా నటీనటుల్లో వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘుబాబులు కొద్దిగా కామెడీ చేసారు. అలాగే వర్ష బొల్లమ్మ ఉన్న సీన్స్ రెండు మూడైనా నటనతో మెప్పించింది.
సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజ్ గురించి కూడా మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. విసుఅల్స్ కి తగ్గట్టు మ్యూజిక్ కూడా అదిరిపోయింది. పాటలతో పాటు ప్రతి సీన్, ప్రతి షాట్ లో ఎమోషనల్ టచ్ తో నేపధ్య సంగీతం అందించి మెప్పించాడు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ కూడా చెప్పుకోదగిన విధముగానే ఉంది. మొత్తానికి డైరెక్టర్ ప్రతిభ సినిమాలో మంచిగా కనిపిస్తుంది.
- ప్లస్ పాయింట్స్:
- సమంత, శర్వానంద్
- మ్యూజిక్
- గీత – సాయి కిరణ్ ల పెర్ఫార్మన్స్
- మహేందిరన్ జయరాజ్ విజువల్స్
- ఫ్లాష్ బ్యాక్
- సెకండ్ హాఫ్
- మైనస్ పాయింట్స్:
- స్లో గా సాగే సన్నివేశాలు
- బోరింగ్ సీన్స్
- ఒరిజినల్ ఫీల్ లేకపోవడం
రేటింగ్: 3/5
టాగ్ లైన్: ఫస్ట్ హాఫ్ స్లో అనిపించినా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి దిల్ రాజు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. యూత్ ఆడియెన్స్ కె కాదు ఫామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా నచుతుంది. ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే అస్సలు మిస్ అవ్వకండి “జాను”ని.
End of Article