Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు లో మూడు రోజుల ఎంక్వయిరీ తర్వాత రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ ద్వారా రియా చక్రవర్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ని కొట్టివేశారు. రియా చక్రవర్తి ని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రియా చక్రవర్తిని జైలుకి తరలించారు. రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు #జస్టిస్ ఫర్ రియా (#justiceforrhea) పేరుతో రియా చక్రవర్తికి మద్దతు ఇస్తున్నారు.
Video Advertisement
డ్రగ్స్ కేసు విషయంలో రియా చక్రవర్తి కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా చెప్పారట. ఆ లిస్ట్ లో రియా చక్రవర్తి చెప్పిన మొదటి ముగ్గురు సెలబ్రిటీల పేర్లని టైమ్స్ నౌ వాళ్లు విడుదల చేశారు. టైమ్స్ నౌ కథనం ప్రకారం ఆ ముగ్గురు సెలబ్రిటీలు ఎవరంటే సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టా. సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు అనే విషయం అందరికి తెలిసిందే. సిమోన్ ఖంబట్టా ఒక ఫ్యాషన్ డిజైనర్.
రియా చక్రవర్తి వీళ్ళిద్దరి పేర్లు అధికారులకి చెప్పడం పై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కే పి ఎస్ మల్హోత్రా ఇదంతా కేవలం రూమర్ అని, బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా తాము తయారు చేయలేదని, డ్రగ్ డీలర్స్, పెడ్లర్స్ వివరాలు మాత్రమే ఐడెంటిఫై చేశామని, వాళ్ళిద్దరి (రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్) పేర్లు లేవు అని చెప్పారు.
దాంతో నటి సమంత రకుల్ ప్రీత్ సింగ్ కి , సారా అలీ ఖాన్ కి క్షమాపణలు చెప్తూ అధికారులు రూమర్ అని ప్రకటించిన వార్తలని #సారీ రకుల్, #సారీ సారా (#sorryrakul, #sorrysara) అనే హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సమంత తో పాటు సోషల్ మీడియాలో ఎంతోమంది రకుల్ ప్రీత్ సింగ్ కి , సారా అలీ ఖాన్ కి క్షమాపణలు చెప్పారు.
End of Article