విడాకులపై మొదటిసారిగా మాట్లాడిన సమంత..! “మళ్లీ ప్రేమిస్తావా..?” అని అడిగితే..?

విడాకులపై మొదటిసారిగా మాట్లాడిన సమంత..! “మళ్లీ ప్రేమిస్తావా..?” అని అడిగితే..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

సమంత నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే తమిళ్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, నయనతార మరో హీరోయిన్ గా నటించారు. సమంత ఇప్పుడు యశోద సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా సమంత కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం కి అతిథిగా వెళ్లారు.

ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో సమంత తన విడాకుల గురించి మాట్లాడారు. అలాగే కరణ్ జోహార్ అడిగిన కొన్ని వ్యక్తిగత ప్రశ్నలకు కూడా సమంత ఈ ప్రోగ్రాంలో సమాధానం చెప్పారు. ఇందులో కరణ్ జోహార్ సమంతని, “మళ్లీ ప్రేమించడానికి ఓపెన్ గా ఉన్నావా?” అని అడిగారు. అందుకు సమంత, “అస్సలు లేదు” అని సమాధానమిచ్చారు. అలాగే విడాకుల సమయంలో తను చాలా బాధ పడినట్టు, అలాగే మానసికంగా సమస్యలు ఎదుర్కొన్నట్టు అర్థం వచ్చేలా సమంత సమాధానాలు చెప్పారు.

ఇంకా చాలా విషయాల గురించి సమంత ఈ ప్రోగ్రాంలో మాట్లాడారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సమంత ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అలాగే సమంతని కరణ్ జోహార్, నాగ చైతన్యకి, తనకి ప్రస్తుతం ఎలాంటి రిలేషన్ ఉంది అన్నట్టుగా అడిగారు. అందుకు సమంత సమాధానంగా, “మా ఇద్దరినీ ఒక రూమ్ లో పెడితే అక్కడ పదునుగా ఉండే వస్తువులన్నిటినీ దాచేయాల్సి ఉంటుంది.” అని అన్నారు. సమంత ఇచ్చిన జవాబుకి కరణ్ జోహార్, “మీ ఇద్దరూ ప్రస్తుతం స్నేహపూర్వకంగా నే ఉన్నారు కదా?” అని అడిగారు. అందుకు సమంత, “ఇప్పుడు అయితే కాదు. బహుశా భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఉన్నాయి.” అని చెప్పారు.


End of Article

You may also like