సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి. సమంత గత కొంత కాలం నుండి టూర్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు కోసం హైదరాబాద్ కి వచ్చారు. సమంత, నాగ చైతన్య విడాకుల వరకు వెళ్లారు అని, ఆ కౌన్సిలింగ్ కోసమే సమంత హైదరాబాద్ కి వచ్చారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది.

times of india whatsapp chat with samantha about divorce

అయితే వీరిద్దరూ విడాకులకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున వీరిద్దరిని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఫలితం లేదు అని సమాచారం. దాంతో ఇద్దరూ మ్యూచువల్ గా విడాకులు తీసుకోబోతున్నారట. ఇది మాత్రమే కాకుండా ఇటీవల నాగ చైతన్య సినిమా లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ బాగుంది అని ప్రశంసిస్తూ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు సమంత. హీరోయిన్ సాయి పల్లవిని మెన్షన్ చేసిన సమంత నాగ చైతన్యని మెన్షన్ చేయలేదు. కానీ నాగ చైతన్య సమంత ట్వీట్ కి “థాంక్యూ సామ్” అని రిప్లై ఇచ్చారు. మామూలుగా సమంత ఎప్పుడు ఇలా చేయలేదు. విడాకుల తర్వాత సమంత ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి . తన బాలీవుడ్ కెరియర్ పై సమంత ఫోకస్ పెట్టనున్నారట.