ఇప్పుడు సమంత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా, హిందీలో కూడా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల సమంత నెగటివ్ పాత్ర పోషించిన ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల అయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో సమంత పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటి వరకు అసలు తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి ఒక ఛాలెంజింగ్ పాత్రని సమంత ఈ సిరీస్ లో చేశారు.

samantha

అయితే సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతోంది. ఇప్పుడు మరొక పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సమంత ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారట.

8 samantha

ఈ పాత్ర గురించి సమంతని సంప్రదించి, కథని వివరించగా సమంత కూడా పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఒకవేళ సమంత ఈ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త నిజమే అయితే ప్రభాస్ సమంత కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే అవుతుంది.