Yashoda Review: యశోద సినిమాతో “సమంత” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Yashoda Review: యశోద సినిమాతో “సమంత” పాన్-ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : యశోద
  • నటీనటులు : సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్.
  • నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్ (శ్రీదేవి మూవీస్)
  • దర్శకత్వం : హరి-హరీష్
  • సంగీతం : మణి శర్మ
  • విడుదల తేదీ : నవంబర్ 11, 2022

yashoda movie review

Video Advertisement

స్టోరీ :

శివ రెడ్డి అనే ఒక వ్యాపారవేత్త మర్డర్ తో సినిమా మొదలవుతుంది. మరొకవైపు యశోద (సమంత) అనే ఒక అమ్మాయి అద్దె గర్భం ద్వారా పిల్లలకి జన్మనివ్వడానికి డాక్టర్ మధు (వరలక్ష్మి శరత్ కుమార్) ఇన్స్టిట్యూట్ లో చేరుతుంది. ఇక్కడ పిల్లలు లేని వారికి అద్దె గర్భం ద్వారా పిల్లలని అందించి వారిని తల్లిదండ్రులు చేస్తారు. అయితే తర్వాత యశోద అక్కడ ఏదో తప్పు జరుగుతోంది అని తెలుసుకుంటుంది. ఆ తప్పు ఏంటి? అసలు యశోద ఎలా కనిపెట్టింది? అసలు అక్కడ తప్పు చేస్తోంది ఎవరు? తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చివరికి ఆ సమస్యలను పరిష్కరించిందా లేదా? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

samantha post about yashoda release..

రివ్యూ :

సమంతని తెలుగు తెరపై చూసి చాలా కాలం అయ్యింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో యశోద సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా ఉన్న సినిమా అని అర్థం అవుతుంది. సినిమాలో స్టార్టింగ్ లో మొత్తం అసలు ఏం జరుగుతోంది అని అర్థం కాకుండా నడుస్తుంది.

samantha remuneration for yashoda

కానీ ఒక్కసారి ట్విస్ట్ ప్రేక్షకులకు తెలిసిపోయాక సినిమా మొత్తం చాలా రొటీన్ కథగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో ప్రేక్షకులు ఊహించగలుగుతారు. పర్ఫామెన్స్ విషయానికి వస్తే సమంత సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో సమంత యాక్షన్ సీన్స్ కూడా చేయగలరు అని నిరూపించారు. ఈ సినిమాలో కూడా అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ చేశారు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించారు.

samantha post about yashoda release..

మిగిలిన పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా మిగిలిన వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరొక హైలైట్. దర్శకులు రాసుకున్న స్టోరీ లైన్ బాగుంది. కానీ ఆ ట్విస్ట్ లని తెరపై చూపించడంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ సినిమా థ్రిల్లర్ సినిమా అయినా కూడా సినిమాలో ఏం జరుగుతోంది అనేది తెలిసిపోతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సమంత
  • మణిశర్మ అందించిన సంగీతం
  • నిర్మాణ విలువలు
  • కొన్ని యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిపోయే కథ
  • సాగదీసినట్టు అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అయినా కూడా పెద్దగా ఆశించకుండా, కేవలం సమంత కోసం అయినా సినిమా చూడాలి అని అనుకునే వారికి యశోద సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.


End of Article

You may also like