Home Filmy Adda నయనతార విషయంలో “అదుర్స్” లో చారి చెప్పిందే నిజమైందిగా? ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

నయనతార విషయంలో “అదుర్స్” లో చారి చెప్పిందే నిజమైందిగా? ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

by Mohana Priya

నయనతార దంపతులు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు ప్రకటించారు. నయనతార భర్త, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వారికి ఇద్దరు అబ్బాయిలు పుట్టినట్టు చెప్పారు. వీరి పెళ్లి కొన్ని నెలల క్రితం జరిగింది. అయితే అద్దెగర్భం పద్ధతిలో వీరు తల్లిదండ్రులు అయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఏదేమైనా సరే ఈ విషయం ప్రకటించిన తర్వాత చాలా మంది నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నయనతార కూడా ఒక హీరోయిన్ గా  నటించిన సంగతి తెలిసిందే.

అయితే జూనియర్ ఎన్టీఆర్ నయనతార మధ్య వచ్చే ఒక సీన్  జూనియర్ ఎన్టీఆర్ నయనతార పాత్రతో, “మీకు ఉన్న పుట్టు మచ్చల ప్రకారం మీకు కవల పిల్లలు పుడతారు” అని చెప్తారు. ఇప్పుడు చూస్తే నిజంగా అదే జరిగింది. అంతే కాకుండా సినిమా క్లైమాక్స్ సీన్ లో బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్, నయనతార దంపతుల కవల పిల్లలని ఆడిస్తూ కనిపిస్తారు. దాంతో “సినిమాలో ముందు కరెక్ట్ గానే చెప్పారుగా? ఇప్పుడు అలాగే జరిగింది” అని అంటున్నారు.

ఇప్పుడు నయనతారకి పిల్లలు పుట్టారు అని ప్రకటించిన తర్వాత ఈ రెండు సీన్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇక నయనతార విషయానికి వస్తే ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో, అలాగే షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇది నయనతార మొదటి బాలీవుడ్ సినిమా.

#

same thing happened with nayantara like said in adhurs movie#

same thing happened with nayantara like said in adhurs movie#

# #

You may also like