Ads
అశోక్, నరసింహుడు, జై చిరంజీవ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయిన నటి సమీరా రెడ్డి. సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించారు. సమీరా రెడ్డి గత కొద్ది సంవత్సరాల నుండి సినిమాలకి దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో విషయాల గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.
Video Advertisement
సమీరా రెడ్డి చాలా సార్లు మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి అని, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండడం చాలా ముఖ్యం అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. ఇదే విధంగా కొన్ని వారాల క్రితం తన ఇంస్టాగ్రామ్ లో సమీరా రెడ్డి తెల్ల జుట్టు ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోకి చాలా మంది సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా సమీరా రెడ్డి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు.
ఇందులో ఒక రిప్లై మాత్రం కొంచెం భిన్నంగా ఉండటంతో సమీరా రెడ్డి దాన్ని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఒక ఫోటోలా పోస్ట్ చేశారు. ఇందులో సమీరా రెడ్డిని ఒక యూజర్, “నాకు ఒకటి అర్థం కావట్లేదు. మీకు కేవలం 42 సంవత్సరాలు. మీ వయసు ఉన్న ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లకి సహజమైన నల్లని జుట్టు ఉంటుంది. కానీ మీ జుట్టు అంత తొందరగా తెల్లబడిపోయింది ఏంటి?” అని అడిగారు.
అందుకు సమీరా రెడ్డి, “నేను ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ అలా మాట్లాడితే అయినా మీ ఆలోచనా విధానం మారుతుంది ఏమో. అవును. చాలా మంది ఆడవాళ్ళు తెల్ల జుట్టుని కవర్ చేస్తారు. కొంత మంది చేయరు. వారిని జడ్ చేయాల్సిన అవసరం లేదు. వారు ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తే చాలు. ఇది కేవలం నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి ఆరోగ్యంగా మాట్లాడే సమయం మాత్రమే” అని రాశారు.
End of Article