Ads
ఒకవైపు దర్శకుడిగా, మరొకవైపు నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు సముద్రఖని. గత కొంత కాలం నుండి తెలుగు సినిమాల్లో కూడా సముద్రఖని నటిస్తున్నారు. తన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన విమానం సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : విమానం
- నటీనటులు : సముద్రఖని, మీరాజాస్మిన్, మాస్టర్ ధృవన్.
- నిర్మాత : కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్
- దర్శకత్వం : శివ ప్రసాద్ యానాల
- సంగీతం : చరణ్ అర్జున్
- విడుదల తేదీ : జూన్ 9, 2023
స్టోరీ :
వీరయ్య (సముద్రఖని), తన కొడుకు రాజు (ధ్రువన్) తో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు. అదే బస్తీలో సుమతి (అనసూయ భరద్వాజ్), కోటి (రాహుల్ రామకృష్ణ) అనే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి, డేనియల్ (ధనరాజ్) అనే ఒక ఆటో డ్రైవర్ కూడా నివసిస్తూ ఉంటారు. రాజు తల్లి తనకి జన్మనిచ్చి చనిపోతుంది. అప్పటి నుండి వీరయ్య రాజు ఆలన పాలన చూసుకుంటూ ఉంటాడు. వీరయ్య అదే బస్తీలో మరుగుదొడ్లు కడుగుతూ ఉంటాడు. కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో తన కొడుకుని చదివిస్తూ ఉంటాడు.
రాజుకి విమానం అంటే చాలా ఇష్టం. ఎప్పటికి అయినా విమానం ఎక్కాలి అనుకుంటూ ఉంటాడు. కానీ రాజుకి లుకేమియా ఉంది అని తెలుస్తుంది. దాంతో తన కొడుకు కోరిక అని నెరవేర్చాలి అని వీరయ్య అనుకుంటాడు. అప్పటి నుంచి విమానం ఎక్కడానికి కావాల్సిన డబ్బులని పోగు చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల వీరయ్య జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు వీరయ్య చేసిన తప్పు ఏంటి? తన కొడుకు కోరికని నెరవేర్చాడా? వారు విమానం ఎక్కారా? వీరయ్య ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఒక సినిమా చూసే ప్రేక్షకుడికి అన్ని ఎమోషన్స్ కంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు, తండ్రి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు, ఇలా ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమాలని బాగా చూపిస్తే, ప్రేక్షకులు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే సినిమా.
ట్రైలర్ చూస్తే ఇది ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సినిమా అని అర్థం అయిపోతోంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. సినిమాలో కంటతడి పెట్టించే సీన్స్ చాలా ఉంటాయి. ఒక కొడుకు కోరిక తీర్చడం కోసం ఆ తండ్రి పడే తపన, దాని కోసం అతను పడే కష్టం, ఇవన్నీ చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల అయితే అసలు ఇది సినిమా అని, వారు నటులు అని మర్చిపోతాం. చాలా సంవత్సరాల క్రితం మాతృదేవోభవ సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రేక్షకులకి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ప్రేక్షకులకి అలాగే అనిపిస్తుంది. అంటే వారు సినిమాలో పడుతున్న బాధలని తెరపై అంత బాగా చూపించారు అని, ప్రేక్షకులు దానికి కనెక్ట్ అయ్యారు అని అర్థం. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకులని కంటతడి పెట్టించేలా చేస్తుంది. అసలు ఊహించి కూడా ఉండరు ఏమో. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం సముద్రఖని. ఆయన ఎంత మంచి నటుడు అనేది మళ్లీ ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపించారు. అలాగే రాజు పాత్ర పోషించిన మాస్టర్ ధ్రువన్ కూడా తన పాత్రకి తగ్గట్టుగా అమాయకంగా నటించారు. ముఖ్య పాత్రల్లో నటించిన అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. అనసూయకి అయితే నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అనసూయ చాలా బాగా నటించారు.
చాలా సంవత్సరాల తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఎయిర్ హోస్టెస్ పాత్రలో మీరా జాస్మిన్ నటించారు. అయితే సినిమాలో ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా కొన్ని చోట్ల మిగిలినవి కూడా కవర్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సినిమా అంతా వీరయ్య, రాజు చుట్టూ తిరిగినా కూడా, మిగిలిన పాత్రల గురించి ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
వారి పాత్రలు సినిమా ముందుకి వెళ్ళటానికి సహాయం చేస్తున్నాయి కాబట్టి వారిపై కూడా కొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని సీన్స్ ఎంతసేపు ముందుకి కదలవు. అలా మెల్లగా నడుస్తాయి అంతే. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- ఎమోషనల్ సీన్స్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా ఉంటే కొన్ని సీన్స్
- తెలిసిపోయే కథ
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
తండ్రి కొడుకులకి మధ్య సాగే ఒక ఎమోషనల్ సినిమా ఇది. ఇలాంటి ఎమోషనల్ సినిమాలని ఇష్టపడే వారికి విమానం సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుంది.
watch trailer :
ALSO READ : TAKKAR REVIEW : “సిద్ధార్థ్” హీరోగా నటించిన టక్కర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article