Home News షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత…సానియా మీర్జా కుటుంభం ఏమని ప్రకటించారంటే.?

షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత…సానియా మీర్జా కుటుంభం ఏమని ప్రకటించారంటే.?

by Sainath Gopi

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది.

heroine is the reason for issues between sania mirza and shoaib malik

ఈ పోస్ట్ తో డైవర్స్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. మాలిక్ వివాహం చేసుకున్నట్టు, అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను ఈరోజు (జనవరి 20) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. సనా జావేద్‍ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్‌’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది.

ఈ విడాకుల తర్వాత..సానియా కుటుంభం ఒక అధికారిక ప్రకటన చేసారు. అందులో ఏముంది అంటే…సానియా జీవితంలోని ఈ సున్నితమైన కాలంలో ఆమె గోప్యతను గౌరవించాలని అభిమానులు మరియు శ్రేయోభిలాషులను కోరుతూ మీర్జా కుటుంబం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా విడాకుల వార్తలను పంచుకోవాలనే నిర్ణయం ఉత్పన్నమైందని పేర్కొంటూ, తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచే సానియా యొక్క ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన మరింత బలపరిచినట్లైంది.

You may also like