Home Filmy Adda AKHANDA2: బాలయ్యను ఢీకొట్టేది ఆ బాలీవుడ్ హీరోనా….?

AKHANDA2: బాలయ్యను ఢీకొట్టేది ఆ బాలీవుడ్ హీరోనా….?

by Sainath Gopi

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాల హిట్ల తో మంచి ఊపు మీద ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల హిట్లవడంతో అదే ఎనర్జీతో పలు సినిమాలను లైన్లో పెట్టారు. తాజాగా మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణకి విలన్ గా యానిమల్ సినిమాతో మెప్పించిన బాబి డియోల్ నటిస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే బాలకృష్ణ ఈ చిత్రం తర్వాత ఆఖండ 2 చిత్రంలో నటించిన తెలుస్తుంది.ఇప్పటికే బోయపాటి అఖండ2 చిత్రాన్ని ప్రకటించారు. పాండమిక్ లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇప్పటికే అఖండ2 సినిమా స్క్రిప్టు లాక్ అయిందట. ఇటీవలే ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బోయపాటితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బాలకృష్ణ డేట్స్ కూడా గీత ఆర్ట్స్ వద్ద ఉన్నాయి.

south movie in which sanjay dutt acted before kgf 2

ఈ లెక్కన చూస్తుంటే అఖండ 2 చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. అయితే ఆ తండాలో బాలకృష్ణకి విలన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ కథ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే అఖండ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

You may also like