సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో చిరు-విజయశాంతి మీద వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో చిరు-విజయశాంతి మీద వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే.

by Megha Varna

Ads

 సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు మెగా అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చాయి. వేదికపై విజయశాంతిని అలా చూస్తూ ఘాటుగా, మోటుగా ఆయన చేసిన కామెంట్స్ సినీ వర్గాలను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు చిరు..22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరినీ మరిచి తమ ఫ్రెండ్‌షిప్‌ గురించి మాట్లాడుకున్నారు.నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా… నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ… చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో… రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు… ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు. అయితే నిన్న జరిగిన ఈవెంట్ లో చిరు,విజయశాంతి గారి మీద వచ్చిన టాప్ మేమ్స్ చూడండి.

Video Advertisement


End of Article

You may also like