Ads
మే 31న సూపర్ స్టార్ కృష్ణ తన 77వ జన్మదినాన్ని జరుపుకున్నారు. కృష్ణ గారి ప్రతి పుట్టినరోజు నాడు మహేష్ బాబు తన కొత్త సినిమా గురించి వెల్లడించడం కొన్ని సంవత్సరాల నుండి వస్తున్న ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా మహేష్ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా డైరెక్టర్ గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కొందరు వంశీపైడిపల్లి అన్నారు, కొందరు త్రివిక్రమ్ అన్నారు, ఇలాంటి ఎన్నో రకాల కథనాల కి ఫుల్ స్టాప్ పెడుతూ మహేష్ తన కొత్త సినిమా పరశురామ్ తో ప్రకటించారు. ఈ సినిమాకి సర్కారు వారి పాట అనే టైటిల్ ని పెట్టారు.
Video Advertisement
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. వైవిధ్యంగా ఉన్న టైటిల్ జనాలని ఆకట్టుకుంది. కానీ చర్చ జరిగేది మాత్రం మహేష్ బాబు లుక్ మీదే. గడ్డం, చెవిపోగు, మెడ మీద ఉన్న రూపాయి టాటూ తో ముఖం రివీల్ చేయకుండా ఉంది ఈ లుక్. దాంతో అసలు సినిమా ఎలా ఉండబోతోంది, మహేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేదానిపై ఇంకా ఆసక్తి పెరిగింది. కానీ మెడ మీద ఉన్న రూపాయి టాటూ వెనక ఒక చిన్న కథ ఉంది.
అదేంటి అంటే పరుశురాం ముందుగా ఈ కథను ఫారిన్ బ్యాక్ డ్రాప్ తో రాసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఫారిన్ లొకేషన్లలో షూట్ చేయడం అంత మంచిది కాదు అనిపించి కథ మొత్తాన్ని మన నేటివిటీకి తగ్గట్టు మార్చారు. నిజానికి అక్కడ రూపాయి కి బదులు డాలర్ టాటూ ఉండాలి. కానీ కథ ఇండియాలోనే నడుస్తుండటంతో రూపాయి సింబల్ గా మార్చారట.
తాజాగా మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో మాట్లాడుతూ ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని దాంతోపాటు ఒక బలమైన సందేశం కూడా ఉంది అని చెప్పారు. గీత గోవిందం తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో పరశురాం మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ తర్వాత తమన్ మళ్లీ మహేష్ బాబు సినిమాకి సంగీత వహిస్తుండగా, పి ఎస్ వినోద్ ఛాయాగ్రాహకుడు గా పని చేస్తున్నాడు. మహేష్ పక్కన కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే భరత్ అనే నేను తర్వాత మహేష్ కియారా కలిసి నటించే రెండో సినిమా అవుతుంది. సర్కారు వారి పాట 2021లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
End of Article