Ads
సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.
Video Advertisement
ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు.
సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎన్నో చానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట సినిమా సెన్సార్ టాక్ వచ్చింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సర్కారు వారి పాట ఫైనల్ కాపీ ఎడిట్ అయ్యింది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా మాస్ బ్లాక్ బస్టర్ అని రాశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అంటే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article