సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఆ రోజు కచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తారు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను ఇవాళ విడుదల చేసారు.

Sarkaru vaari paata first look

ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేసారు. ఇందులో మహేష్ బాబు ఒక రెడ్ కలర్ కార్ లో కూర్చొని కనిపిస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. అంతే కాకుండా ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుంది అని కన్ఫామ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.