సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రాబోతున్న సినిమా సర్కారు వారి పాట అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 10 రోజుల్లో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది. ఆ రోజు కచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తారు అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను ఇవాళ విడుదల చేసారు.Sarkaru vaari paata first notice

సర్కారు వారి పాట సినిమాలో ఒక పోస్టర్ విడుదల చేసి, సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్ అని చెప్పి, జూలై 31వ తేదీ అని ఇచ్చారు. ఇందులో మహేష్ బాబు చేతిలో బ్యాగ్ పట్టుకొని కనిపిస్తున్నారు. అలాగే చుట్టూ బైకులు, కార్లు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ నోటీస్ అంటే ఫస్ట్ లుక్కా? లేదా టీజరా? అనేది తెలియాలంటే మాత్రం జులై 31వ తేదీ వరకు ఆగాల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులని తమన్ మొదలుపెట్టారు.