సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

by Mohana Priya

Ads

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.

Video Advertisement

ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు.

did you observe this in sarkaru vaari paata latest poster

సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

sarkaru vaari paata movie review by umair sandhu

సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎన్నో చానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కారు వారి పాట సినిమా మొదటి రివ్యూ వచ్చింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ రివ్యూ గురించి ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ గురించి ఈ విధంగా రాశారు. ఉమైర్ సంధు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “సర్కారు వారి పాట చాలా కారణాల వల్ల నచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టోరీ సింపుల్ గా ఉన్నా కూడా చాలా బలంగా ఉంది. ట్విస్ట్ ఉంటుంది. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. కానీ సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం మహేష్ బాబు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. ఈ సినిమా చూడటానికి ఈ ఒక్క కారణం చాలు.”

sarkaru vaari paata movie review by umair sandhu

“ఇటీవల గత కొంత కాలంలో పోలిస్తే మహేష్ బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఫ్యాన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. సర్కారు వారి పాట కీర్తి సురేష్ లేకుండా పూర్తి అవ్వదు. పాత్రకి ఎలాంటి డిగ్నిటీ అయితే కావాలో కీర్తి సురేష్ అలాగే చేశారు. ఇది ఖచ్చితంగా ఒక మాస్ బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు వ్యక్తిగతంగా ఇది ఇటీవల కాలంలో నచ్చిన తెలుగు సినిమా” అని రాశారు.”


End of Article

You may also like