Home Filmy Adda “సర్కారు వారి పాట” సర్ప్రైజ్ అప్‌డేట్ ఇదేనా..?

“సర్కారు వారి పాట” సర్ప్రైజ్ అప్‌డేట్ ఇదేనా..?

by Mohana Priya

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు.

ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది.

గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

sarkaru vaari paata surprise update

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక అప్ డేట్ ఇవాళ ఇస్తారు అని సినిమా బృందం ప్రకటించారు. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటిది జరగలేదని సినిమా బృందం చెప్పారు. ఆ అప్ డేట్ ఏమయ్యి ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని సినిమా బృందం రేపు ప్రకటిస్తారు. ప్రస్తుతం విజయ్ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. దాంతో విజయ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే సినిమా బృందం ప్రకటించే అంతవరకు ఆగాల్సిందే.

You may also like