మళ్లీ దొరికిపోయావేంటి తమన్ అన్నా..? “సర్కారు వారి పాట” టైటిల్ సాంగ్ కూడా కాపీయేనా..?

మళ్లీ దొరికిపోయావేంటి తమన్ అన్నా..? “సర్కారు వారి పాట” టైటిల్ సాంగ్ కూడా కాపీయేనా..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల విడుదల అయ్యాయి.

Video Advertisement

గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమాలోని మూడవ పాట ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఈ పాటని హారిక నారాయణ్ పాడారు.

sarkaru vaari paata title song is similar to a latest song

ఈ పాటపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఈ పాట అంతకు ముందు విడుదలైన ఒక పాట మ్యూజిక్ కి దగ్గర దగ్గరగా ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో వచ్చే ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఈ పాటలో వచ్చే మ్యూజిక్ లాగానే ఉంది. దాంతో సడన్ గా వింటే అఖండ సినిమా పాట గుర్తొస్తుంది. ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

https://youtu.be/cwKdCqcF9v4


End of Article

You may also like