Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలోని రెండు పాటలు ఇటీవల విడుదల అయ్యాయి.
Video Advertisement
గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ ఈ సర్కారు వారి పాట సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు లుక్ కూడా ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో సినిమాకి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమాలోని మూడవ పాట ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు కనిపిస్తున్నారు. ఈ పాటని హారిక నారాయణ్ పాడారు.
ఈ పాటపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఈ పాట అంతకు ముందు విడుదలైన ఒక పాట మ్యూజిక్ కి దగ్గర దగ్గరగా ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో వచ్చే ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఈ పాటలో వచ్చే మ్యూజిక్ లాగానే ఉంది. దాంతో సడన్ గా వింటే అఖండ సినిమా పాట గుర్తొస్తుంది. ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
https://youtu.be/cwKdCqcF9v4
End of Article