Ads
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన చిత్రం శశి. ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వం వహించగా, శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ శశి సినిమాని నిర్మించారు. ఎక్స్ప్రెస్ రాజా, నాని జెంటిల్ మన్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన సురభి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
Video Advertisement
శశి సినిమాకి అరుణ్ చిలువేరు పాటలని సమకూర్చారు. ఇటీవల విడుదలైన టీజర్, అలాగే ఒకే ఒక లోకం నువ్వే అనే పాట ప్రేక్షకాదరణ పొందాయి. శశి సినిమా మార్చ్ 19 వ తేదీన థియేటర్లలోకి రాబోతున్నట్టు సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది.
End of Article