తేడా వస్తే రఫ్ ఆడిస్తున్న సత్యభామ.. ఎన్నెన్నో జన్మల బంధం పార్ట్ 2 అంటున్నారు నిజమేనా?

తేడా వస్తే రఫ్ ఆడిస్తున్న సత్యభామ.. ఎన్నెన్నో జన్మల బంధం పార్ట్ 2 అంటున్నారు నిజమేనా?

by Mounika Singaluri

Ads

Satyabhama : స్టార్ మా లో త్వరలోనే రాబోతున్న సరికొత్త సీరియల్ సత్యభామ. ఈ సీరియల్ ప్రోమోని చూసిన ప్రేక్షకులు ఆనందానికి గురవుతున్నారు ఎందుకంటే వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్లో వేద, యష్ జంటగా నటించి మనందరినీ ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీం తో అదే హీరో హీరోయిన్లతో వస్తున్న ఈ సీరియల్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు వేద, యష్ అభిమానులు.

Video Advertisement

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేదగా నటించిన ఈ నటి పేరు బేబీ జాన్ మెదక్ ఇప్పుడు ఈ సీరియల్ లో టైటిల్ రోల్ అయిన సత్య భామ క్యారెక్టర్ పోషిస్తుంది. అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్ గా నటించి పెద్ద లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యష్ అసలు పేరు నిరంజన్ ఈ సీరియల్ లో రౌడీగా, రఫ్ లుక్స్ తో కపించబోతున్నాడు.

సత్యభామ ఈ సీరియల్ లో చదువుల తల్లిగా కనిపించబోతుంది వారి కుటుంబం అనుబంధాలకి ఆప్యాయతలకి విలువ కుటుంబం కాగా హీరోది కక్షలు, కార్పన్యాలకు నిలయమైన రౌడీల కుటుంబం. మరి వీరిద్దరూ ఎలా కలవబోతున్నారు కలిసిన తరువాత స్టోరీ ఎలా ఉండబోతున్నది అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ప్రోమో చూస్తుంటే సత్యభామ కూడా వేద లాగా సాఫ్ట్ గా కనిపిస్తుంది అలాగే తను సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచే ఒక కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది, కానీ తేడా వస్తే మాత్రం సత్యభామలాగా ఫైర్ అయిపోతుంది. ఆడది కొట్టేదెబ్బని తట్టుకోవటం చున్నీ లాగినంత ఈజీ కాదు అంటూ లేడీ బాలయ్య లాగా ఆమె చెప్పిన డైలాగ్ ప్రోమో ఇప్పటికే హిట్ అయింది. అయితే రౌడీ పాత్రలో నటించిన నిరంజన్ మాత్రం ఈ సీరియల్లో కాస్త రఫ్ గా కనిపిస్తున్నాడు.

వీరిద్దరూ కలయిక ఎలా జరగబోతుంది, అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఏమిటో అని ఉత్సాహం చూపిస్తున్నారు ఎన్నెన్నో జన్మల బంధం అభిమానులు. ఈ డైరెక్టర్ కూడా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కి పెద్ద అభిమాని అయి ఉంటాడు అందుకే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లోనే సీరియల్ ని తీస్తున్నాడు అంటూ తమ ఉత్సాహాన్ని తెలియజేస్తున్నారు. అంతలా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అభిమానులని కట్టిపడేసింది.

రన్నింగ్ ఎంత బాగుందో ఎండింగ్ కూడా అంతే బాగుంది అంటూ యాక్టర్స్ తో పాటు డైరెక్టర్ని కూడా ఆకాశానికి ఎత్తేశారు ప్రేక్షకులు. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. సేమ్ హీరో హీరోయిన్ కాంబినేషన్లో బ్యాక్ టూ బ్యాక్ సీరియల్స్ ఒకే జంటతో రావటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఈ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ పార్ట్ 2 అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సీరియల్ మేకర్స్.

ఈ సీరియల్ డిసెంబర్ 18 నుంచి స్టార్ మా లో రాత్రి 9:30 కి ప్రారంభం కానుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన సత్యభామ ప్రోమోస్ చూస్తుంటే ఇది లేడీ ఓరియంటెడ్ సీరియల్ లాగా కనిపిస్తుంది యష్ కి ప్రాధాన్యత ఉండబోతుందా అంటూ యష్ ఫ్యాన్స్ అప్పుడే తెగ బాధ పడిపోతున్నారు. మరి సత్యభామ సీరియల్ కూడా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లాగా మంచి టిఆర్పి రేటింగ్ ని సాధిస్తుందో లేదో వేచి చూడాలి. సో ఆ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్.


End of Article

You may also like