Ads
ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమా మా ఊరి పొలిమేర. సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అయిన మా ఊరి పొలిమేర 2 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : పొలిమేర 2 (మా ఊరి పొలిమేర-2)
- నటీనటులు : సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను.
- నిర్మాత : గౌర్ కృష్ణ
- దర్శకత్వం : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
- సంగీతం : గ్యాని
- విడుదల తేదీ : నవంబర్ 3, 2023
స్టోరీ :
కొమిరి (సత్యం రాజేష్) మామూలు వ్యక్తి కాదు అని, అతను చేతబడి చేస్తాడు అని ఒక పాయింట్ తో మొదటి పార్ట్ ఎండ్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. అసలు అతను అలా ఎందుకు చేస్తున్నాడు? దాని తర్వాత ఊరిలో నుండి వెళ్లిపోయాడా? ఆ తర్వాత కొమిరి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అతని కుటుంబం ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వచ్చింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సాధారణంగా సత్యం రాజేష్ అంటే ఎక్కువ శాతం కామెడీ పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన క్షణం సినిమాతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. సత్యం రాజేష్ కామెడీ మాత్రమే కాదు ఇతర ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించగలరు అని నిరూపించుకున్నారు. అప్పటి నుండి రకరకాల పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాతో మరొక మెట్టు ఎక్కారు. మొదటి భాగం అయిన పొలిమేర చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఒక ఊరిలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? అందుకు కారణం ఏంటి? మంత్రాలు ఇవన్నీ ఇందులో చూపించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన సినిమా కూడా దాదాపు అదే పాయింట్ మీద నడుస్తుంది. ఈ సినిమా కూడా ఒకటి ట్విస్ట్ తో ఎండ్ చేశారు. దీనికి మూడవ భాగం కూడా ఉంటుంది అని అర్థం అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాకి సంబంధించిన ఒక సెటప్ ని నిర్మించుకోవడంలో అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటాయి.
ఇందులో కొన్ని ప్రేక్షకులకు అర్థం అయితే కొన్ని మాత్రం ఊహకి కూడా అందవు. కథ చాలా బాగా తెలిసిన కథ. కానీ దానికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంశాన్ని యాడ్ చేసి సినిమా మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకుడు సీట్ నుండి కదలకుండా కూర్చునే అంత బాగా తీశారు. కానీ కొన్ని ట్విస్ట్ లు మాత్రం రిపీట్ అయినట్టు అనిపిస్తాయి. జరిగిందే జరుగుతూ ఉంటుంది. పాత్రల విషయానికి వస్తే మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంది కాబట్టి పాత్రలు కూడా వాళ్లే ఉన్నారు.
అయితే పోలీసు పాత్రలో రాకేందు మౌళి నటించారు. పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా ఆ పాత్రకి ఇంకా ఎవరిని అయినా తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు బాగుంది. కానీ ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్స్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా కొంచెం హెవీగా ఉండి ఉంటే ఆర్టిస్ట్ ఇంకా బాగా కనిపించేది. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్స్ నైట్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే సీన్స్ ఉంటాయి. ఈ సీన్స్ చాలా వరకు చీకటిలోనే తీశారు.
వీటిలో కొన్ని క్లారిటీ మిస్ అయ్యాయి. అక్కడ ఏం జరుగుతోంది అనేది అంత బాగా అర్థం అవ్వదు. అయితే హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్ళ సంగతి సరే. కానీ అలా ఫ్లోలో వెళ్ళిపోయే సినిమాలు చూడాలి అనుకునే వారు మాత్రం ఈ సినిమా నుండి అదంతా ఆశించకపోవడం మంచిది. మొదటి నుండి, అందులోనూ ఎక్కువగా సెకండ్ హాఫ్ నుండి సినిమా చాలా స్పీడ్ గా వెళ్తుంది. కానీ కొన్ని ట్విస్ట్ రివీల్ చేసే సీన్స్ లో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- సెకండ్ హాఫ్
- క్లైమాక్స్ ఎపిసోడ్
- భయపెట్టే కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
- తెలిసిపోయే కథ
- జరిగిందే జరిగినట్టుగా ఉండే కొన్ని ట్విస్ట్ లు
- కొన్ని పాత్రలని రాసుకున్న విధానం
- లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఫీల్ గుడ్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా మినహాయింపు ఏమో. కానీ హారర్ సినిమాలని, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడేవారు ఈ సినిమా తప్పకుండా చూడండి. కొంచెం తెలిసిపోయే కథ, కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నా కూడా మా ఊరి పొలిమేర 2 సినిమా ఒక్కసారి చూడగలిగే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : 68 ఏళ్ళ చిరంజీవి పక్కన హీరోయిన్ గా… 31 ఏళ్ళ హీరోయిన్..! ఇది ఎలా సాధ్యం..?
End of Article