Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu 5 : ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

Bigg Boss Telugu 5 : ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 8 వారాలు గడిచింది. ప్రస్తుతం ప్రోగ్రాం ఎనిమిదవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన ఏడు ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో లోబో ఎలిమినేట్ అయ్యారు.

saved contestant in bigg boss telugu 5 nominations

అయితే నిన్న నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు వారు నామినేట్ చేయాలి అనుకున్న మరొక ఇంటి సభ్యులపై ఫోమ్ వేసి, వారు నామినేట్ చేయడానికి గల కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఇవాళ ఇంటి సభ్యులకి నామినేషన్ నుండి బయటపడటానికి ఒక టాస్క్ ఇచ్చారు. నామినేట్ అయిన ఇంటి సభ్యులు ఈ టాస్క్ లో పాల్గొని ఒక సూపర్ పవర్ పొంది వారిని వారు నామినేషన్ నుండి రక్షించుకోవచ్చు. ఇందులో భాగంగా అనీ మాస్టర్ ఆ సూపర్ పవర్ పొందారు అని సమాచారం. దాంతో అనీ మాస్టర్ నామినేషన్ నుండి బయటపడతారు.

You may also like