Ads
ఫోటోగ్రఫీ చాలా కష్టమైన పని అందులోనూ ముఖ్యంగా వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ ఇంకా కష్టం. అడవుల్లో తప్ప బయట ఎక్కడా కనిపించని అరుదైన జీవులన్నిటినీ వెతికి వాటిని జాగ్రత్తగా స్పష్టంగా ఫోటోలు తీయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ మామూలు ఫోటోగ్రఫీ కంటే కొంచెం ఎక్కువగా శ్రమతో కూడుకున్న పని.
Video Advertisement
ఇటీవల మిథున్ అనే ఒక ఫోటో గ్రాఫర్ ఒక చిరుత పులి ఒక బ్లాక్ పాంథర్ కలిసి నిల్చుని ఉన్న ఒక ఫోటో ని తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. బ్లాక్ పాంథర్ పేరు సాయా, చిరుత పులి పేరు క్లియోపాత్రా. ఆ ఫోటో చూస్తే పులులు ఫోటో షూట్ చేయించుకోవడానికి పోస్ ఇచ్చాయా అన్నట్టు ఉంది. ఆ ఫొటో కోసం ఆరు రోజులు కష్టపడ్డాడు మిథున్.
“మామూలు గా మగ పులి అయిన బ్లాక్ పాంథర్ ముందు ఉంటే వెనకాల చిరుతపులి పాంథర్ ని అనుసరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకంగా చిరుత పులి ని పాంథర్ అనుసరిస్తోంది” అని మిథున్ ఫోటో కింద క్యాప్షన్ లో రాశాడు. మిథున్ అంతకుముందు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో సాయా మీద చేసిన డాక్యుమెంటరీకి పని చేశాడు.
కొన్ని రోజుల క్రితం, షాజ్ జంగ్ అనే వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా కబినిలో ఉన్న బ్లాక్ పాంథర్ సాయా ని ఫోటో తీశాడు. ఆ ఫోటో కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు షాజ్. తన డ్రైవర్ ఇంకా ఫారెస్ట్ గార్డ్ తో పాటు అడవిలోకి వెళ్లి ఎంతో జాగ్రత్తగా చాలాకాలం ఓపికగా వేచి చూసి ఈ ఫోటో తీశాడు. ఈ ఫోటో నేషనల్ జియోగ్రఫీ వాళ్లతో కలిసి షాజ్ పనిచేసిన డాక్యుమెంటరీ ది రేర్ బ్లాక్ పాంథర్ కోసం తీసింది. షాజ్ తన బృందం తో కలిసి 2017 నుండి ప్రయత్నిస్తే జనవరి 2020 లో ఇంత మంచి ఫోటో ని తీయగలిగాడు.
End of Article