Home Filmy Adda కాలేజీ చదువుకునేటప్పుడు సీతారామశాస్త్రి గారు ఎలా వున్నారో చూసారా..?

కాలేజీ చదువుకునేటప్పుడు సీతారామశాస్త్రి గారు ఎలా వున్నారో చూసారా..?

by Megha Varna

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు ప్రేక్షకులకి తీరని లోటు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాలా మంది సెలబ్రెటీలు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన ఎన్నో అద్భుతమైన పాటలను రచించారు. ప్రస్తుతం ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన రాసిన పాటలు మనకి చిరకాలం గుర్తుండిపోతాయి.

ఇదిలా ఉంటే తాజాగా సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి ఫోటో ఒకటి నెట్టింట్లో తెగ షికార్లు కొడుతోంది. ఇంటర్ తర్వాత సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారు ఆంధ్ర మెడికల్ కళాశాలలో చేరారు. అప్పటికి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారు డాక్టర్ చదవాలని అనుకున్నారు.

అందుకోసం విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో చేరారు. కానీ అప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో మధ్యలోనే దానిని ఆపేయాల్సి వచ్చింది. ఆనాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తున్నారు. అలానే నిజంగా ఆయన కనుక డాక్టర్ అయ్యుంటే రచయితగా పొందిన కీర్తిప్రతిష్ఠలు ఆయనకి ఉండేవి కావేమో.

You may also like