Ads
కరోనా టైంలో సినీ ప్రేక్షకులు ఇండస్ట్రీలో ఒకపక్క పెళ్ళిళ్ళు మరోపక్క విషాదాలు ఒకేసారి చూడవలసి వస్తుంది. ఈ వారంలో ఇప్పటికే రావి కొండల రావు గారు మరణించారు ఇక తాజాగా ఓ ప్రముఖ తెలుగు దర్శకుడు ఇంట విషాదం చోటు చేసుకుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) గారు శనివారం ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.విషయం తెలుసుకున్న పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు శేఖర్ కమ్ములను పరామర్శించారు.
శేఖర్ కమ్ముల గారి తండ్రి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో జరగనున్నాయి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది.కరోనా ఉపద్రవం తగ్గాక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.
End of Article