మరో మిర్యాలగూడ ఘటన…కూతురు కులాంతర వివాహం చేసుకుందని కిడ్నప్.! చివరికి?

మరో మిర్యాలగూడ ఘటన…కూతురు కులాంతర వివాహం చేసుకుందని కిడ్నప్.! చివరికి?

by Sainath Gopi

మారుతీ రావు ఆత్మహత్య ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. పరువు కోసం సొంత
అల్లుడిని హత్య చేయించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అమృతకు భర్తను దూరం చేసాడు. ఈ ఘటన ఇంకా మరువకముందే తాజాగా కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపంతో రగిలిపోయిన ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల లోకి వెళ్తే…

ఈరోడ్‌ జిల్లా భవానికి చెందిన సెల్వం, ఇలమది వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు. ఈ ఇద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీలో పని చేస్తున్న ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. తమ పెళ్లికి అంగీకరించే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఈ జంట కులాంతర వివాహానికి సిద్ధమైంది. వీరికి సేలం మెట్టూరుకి చెందని ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఈశ్వరన్ సాయం చేసారు. ఆయన సమక్షంలోనే సెల్వం, ఇలమది పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి ఇళ్ళకి వారు వెళ్లిపోయారు. రాత్రి సమయంలో సినీ తరహాలో కార్లు వచ్చి ఈశ్వరన్‌ ఇంటి ముందు ఆగాయి. వచ్చీ రాగానే, పదుల సంఖ్యలో వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. అనంతరం అతడిని కిడ్నాప్‌ చేశారు. అక్కడి సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ క్రమంలో నూతన వధూవరులు వారినుండి తప్పించుకునే ప్రయత్నం చేసారు. కానీ వాళ్ళని కూడా పట్టుకొని కిడ్నప్ చేసారు ఆ గ్యాంగ్. అస్సలు ఏమి జరుగుతుందో అన్న టెన్షన్‌ ఓ వైపు పెరగడంతో పెరియార్‌ ద్రావిడర్‌ ఇయక్కం వర్గాలు కొళత్తూరు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు రంగం లోకి దిగారు. తర్వాత ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న గొడవను సద్దుమణిచారు

జగన్నాథన్‌ వద్ద జరిపిన విచారణతో మూడు వేర్వేరు కార్లలో వేర్వేరు మార్గాల్లో ఈశ్వరన్, ఇలమది, సెల్వన్‌ను తరలించినట్టు తేలింది. అర్ధరాత్రి వేళ పోలీసులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు. చివరకు మంగళవారం వేకువ జామున ఈశ్వరన్, సెల్వంను రక్షించారు. ఇలమది సమాచారం తెలియక పోవడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె గురించి జగన్నాధ్ అసలు విషయం బయటపెట్టట్లేదు. పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.

You may also like