Ads
పలు తెలుగు సినిమాల్లో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు. ఈ విషయాన్నీ ఆమె భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలు సమయంలో నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, ప్రస్తుతం అతన్ని హైదరాబాదులోని సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించామని అన్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ప్రమాదశాత్తు నర్సింగ్ పడిపోయారు.ప్రస్తుతం ఆయనకి వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నారు. తలకు బలమైన గాయమైందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Video Advertisement
25 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న ఈయన ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు. ఇప్పుడు ఈయనకు అనుకోని ప్రమాదం జరిగింది. ఈయన వయసు 56 సంవత్సరాలు. వర్మ తెరకెక్కించిన క్షణ క్షణం, గాయం లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నర్సింగ్. హిందీ, తెలుగు, తమిళం అన్నీ కలిపి దాదాపు 400 సినిమాలకు పైగానే నటించాడు నర్సింగ్ యాదవ్.
ఇది ఇలా ఉంటె.. నర్సింగ్ యాదవ్ అనుకోకుండా కోమాలోకి వెళ్ళాడని, 48 గంటలు పాటు అబ్జర్ వేశాన్ లో ఉంచినట్టుగా ఆమె వెల్లడించారు. నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయాడని, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. సోషియల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించామని ఆమె వెల్లడించారు. మాస్టర్’, ‘చంద్రలేఖ’, ‘ఇడియట్’, ‘జానీ’, ‘ఠాగూర్’, ‘వర్షం’, ‘సై’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘మాస్’, ‘అడవి రాముడు’, ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు.
End of Article