Ads
Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తుంది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ యువ హీరోల నుండి అగ్రహీరోల వరకు అందరూ ఫాలో అవుతున్నారు. మరి సీనియర్ స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తారో చూడాలి.
Video Advertisement
తెలుగు సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున. ఈ హీరోలు వీళ్ళ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ హీరోల వయస్సు 60 ఏళ్లు దాటినా వీరికి రోజు రోజుకి క్రేజ్ పేరుగుతూనే ఉంది. అలాగే ఈ సీనియర్ స్టార్స్ కి యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందులోనూ సంవత్సరానికి కనీసం ఒక మూవీ విడుదల అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ హీరోలు.కానీ ఈ హీరోలు వేరే భాషల్లో మూవీస్ ని రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టటడం లేదనే చెప్పాలిఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదుఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.
End of Article