జూనియర్ హీరోల పక్కన సీనియర్ హీరోయిన్లు… త్వరలో రానున్న ఈ 7 కాంబినేషన్స్ చూసేయండి.!

జూనియర్ హీరోల పక్కన సీనియర్ హీరోయిన్లు… త్వరలో రానున్న ఈ 7 కాంబినేషన్స్ చూసేయండి.!

by Megha Varna

ఏదైనా ఒక సినిమా తీస్తున్నారు అంటే అందులో హీరో, హీరోయిన్ల ఎంపిక చేయడం అనేది కీలకం. హీరో, హీరోయిన్లు బాగా సినిమాకి ప్లస్ అవుతారు. అందుకని హీరోహీరోయిన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా చూసి ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే హీరోయిన్లకి సినీ ఇండస్ట్రీలో లైఫ్ టైం కొంచెం తక్కువగా ఉంటుంది.

Video Advertisement

హీరోలు మాత్రం ఏళ్ల తరబడి నటిస్తూ ఉంటారు, హీరోయిన్లకు హీరోయిన్లగా నటించే అవకాశం తగ్గినప్పుడు వివిధ పాత్రల్ని చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సీనియర్ హీరోయిన్ల పక్కన కూడా తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్లు నటించాల్సి వస్తుంది. రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనో లేదు అంటే కెరియర్ కి ప్లస్ అవుతుందనో నటిస్తూ ఉంటారు.

అయితే ఏ పాత్రా లేకపోవడం కంటే కూడా ఏదో ఒక పాత్ర చేయడం మంచిది కదా అది భావిస్తూ ఉంటారు కొందరు హీరోయిన్లు. సీనియర్ హీరోయిన్లు పక్కన చిన్న వయసు హీరోయిన్లు నటిస్తూ ఉంటారు. ఇప్పుడైతే జూనియర్ హీరోల పక్కన సీనియర్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. పైగా ఆ జంట ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటోంది. అలా నటిస్తున్న హీరో హీరోయిన్ల గురించి చూద్దాం.

#1. అనుష్క శెట్టి – నవీన్ పోలిశెట్టి:

పదిహేను సంవత్సరాలుగా అనుష్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది అనుష్క. నవీన్ పోలిశెట్టి చూస్తే కుర్ర హీరో. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పుడు రాబోతోంది. శెట్టి మిస్టర్ పోలిశెట్టి పేరుతో ఈ సినిమా రానుంది.

#2. నాగశౌర్య – కీర్తి సురేష్:

యంగ్ హీరో నాగ శౌర్య పక్కన కీర్తి సురేష్ నటించనుంది. అదేవిధంగా కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

#3. సమంతా – దేవ్ మోహన్:

మలయాళ హీరో దేవ్ మోహన్ తో సమంత శాకుంతలం సినిమాలో నటించనుంది. గుణశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

#4. ప్రతీక్ గాంధీ – విద్యాబాలన్:

జూనియర్ హీరో అయినా ప్రతీక్ గాంధీతో ఈ సీనియర్ హీరోయిన్ నటించనుంది. ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి..!

#5. కత్రినాకైఫ్ – విజయ్ సేతుపతి:

కత్రినా కైఫ్ క్రేజ్ చూస్తే మామూలు క్రేజ్ కాదు. విజయ్ సేతుపతి కూడా క్రేజ్ ఉన్నప్పటికీ కత్రినా అంత కాదు. అయితే ఈ జంట కాంబినేషన్ తో రాబోతున్న సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

#6. దీపికా పదుకొనే – సిద్ధాంత్ చతుర్వేది:

దీపికా పదుకొనే సీనియర్ హీరోయిన్. సిద్ధాంత్ చతుర్వేది అయితే కాస్త జూనియర్ హీరో. అయితే మరి ఈ సీనియర్ హీరోయిన్ ఆ జూనియర్ హీరోతో కలిసి నటించనుంది. మరి వాళ్ళ జంట ఎలా ఉంటుందో చూడాలి.

#7. తమన్నా – సత్యదేవ్ :

తమన్నా , సత్యదేవ్ …ఈ ఇద్దరి కాంబోలో “గుర్తుందా శీతాకాలం” అనే సినిమా రాబోతుంది.


You may also like