Home Filmy Adda ఆ రోజు అన్నగారు చెప్పిన మాటే…ఇప్పుడు చిరంజీవి కుటుంబాన్ని కాపాడుతుందంట.! ఏంటంటే.?

ఆ రోజు అన్నగారు చెప్పిన మాటే…ఇప్పుడు చిరంజీవి కుటుంబాన్ని కాపాడుతుందంట.! ఏంటంటే.?

by Sainath Gopi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు కి ఎంతో మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా మూలస్థంభం గా నిలబడ్డారు ఆయన. తనతో నటించే నటీనటులకు ఇతర హీరోలకు ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేవారని చెబుతూ ఉంటారు. అలాంటి సలహా ఒకటి మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ ఇవ్వగా అది తన జీవితాన్నే మార్చేసింది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

లోకనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్ తో ఏఎన్ఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. ఒకసారి ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా పలకరించి… రండి బ్రదర్ కూర్చోండి… మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు… మీరు మీ సంపాదనను ఇనుపు ముక్కల మీద పెట్టకండి… స్థలాలు, ఇల్లు కొనుక్కోండి అవే మనల్ని కాపాడతాయి… స్టార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అని సలహా ఇచ్చారట.

చిరంజీవికి కొత్త కారులంటే చాలా ఇష్టమట… మార్కెట్లోకి ఏ కార్ వచ్చినా తన వద్ద ఉండాలని అనుకునేవారట.అయితే ఎన్టీఆర్ చెప్పిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఇల్లు స్థలాలు కొనడం మొదలు పెట్టారని ఈరోజు అవే తన కుటుంబాన్ని కాపాడుతున్నాయని గుర్తు చేసుకున్నారు.

https://www.facebook.com/watch?v=694029172799307

 

You may also like