Ads
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.తాజాగా స్వాతి చినుకులు,బంధం సీరియల్స్ లో నటిస్తున్న భరద్వాజ్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.
Video Advertisement
దీన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు.నాకు దగ్గు,జలుబు లాంటి సింటంస్ ఏమీలేవు కాని నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.కాబట్టి నా తోటి నటీ నటులు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి.ఇది ఎందుకొచ్చింది ఎవరినుండి వచ్చింది అన్న ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు.
కరోనా వచ్చిందన్న విషయాన్ని పక్కన వాళ్ళు, చుట్టు పక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని దాచకుండా ధైర్యంగా చెప్పండి.డాక్టర్లు సూచించిన ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే కరోనా ఖచ్చితంగా నయమైపోతుంది.ఈ విషయం పై అనవసరంగా నెగిటివిటీ ని స్ప్రెడ్ చేయకండి. దీని వల్ల కరోనా ఎఫెక్ట్ అయిన వ్యక్తి కుటుంబాలు చాలా బాధపడుతాయి.ఈ కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి…అని అన్నారు.
https://www.instagram.com/tv/CCds9Nfl1w8/?igshid=lwiyu4wa8ed5
End of Article