Pathaan Review : “షారుఖ్ ఖాన్” హీరోగా నటించిన పఠాన్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Pathaan Review : “షారుఖ్ ఖాన్” హీరోగా నటించిన పఠాన్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : పఠాన్
  • నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం.
  • నిర్మాత : ఆదిత్య చోప్రా (యష్‌రాజ్ ఫిల్మ్స్)
  • దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
  • సంగీతం : విశాల్ – శేఖర్
  • విడుదల తేదీ : జనవరి 25, 2023

pathaan movie review

Video Advertisement

స్టోరీ :

సినిమా మొత్తం పఠాన్ (షారుఖ్ ఖాన్) అనే ఒక రా ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న పఠాన్, మళ్లీ జిమ్ (జాన్ అబ్రహం) చేసే ఒక పని వల్ల ఒక మిషన్ చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. జిమ్ తన బృందంతో కలిసి చేసే పనులని పఠాన్ ఎలా అడ్డుకుంటాడు? చివరికి తన దేశాన్ని కాపాడగలిగాడా? ఇవన్నీ పరిష్కరించే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అసలు పఠాన్ ఎలాంటి ప్లాన్ వేశాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

pathaan movie review

రివ్యూ :

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే కష్టమైన విషయం. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా దానితో పాటు అంతకుమించి ఎక్కువ కష్టపడితే మాత్రమే పెద్ద స్టార్ అవ్వగలుగుతారు. అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ అంటే ఇంకా కష్టం. అక్కడ సినిమాలో ఛాన్స్ దొరకడం కూడా అసలు కుదరని పని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో అసలు సినిమా అంటే తెలియని కుటుంబం నుండి వెళ్లి బాలీవుడ్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు షారుఖ్ ఖాన్. గత కొద్ది సంవత్సరాల నుండి షారుఖ్ ఖాన్ ఎన్నో రకమైన సినిమాలు చేస్తున్నారు.

pathaan movie review

ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా ఉండేలాగా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. కానీ కలెక్షన్ల పరంగా ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. దాంతో ఇప్పుడు ప్రేక్షకుల ఆశలు అన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అది మాత్రమే కాకుండా పఠాన్ సినిమా హిందీలో మాత్రమే కాదు తెలుగు, తమిళ్ లో కూడా విడుదల అవుతోంది. సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అని అర్థం అవుతోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అంటే యాక్షన్ సినిమాలు ముందుగా గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఉంది. సినిమా మొత్తం చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది.

pathaan movie review

ఎక్కడ కూడా ప్రేక్షకులు సినిమా నుండి తమ ఆలోచనని పక్కదారి పట్టించకుండా ఉండేలాగా ముందుకు వెళుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ ని ఇలా చూస్తున్నాం అనిపిస్తుంది. అంతే కాకుండా దీపిక, జాన్ అబ్రహం కూడా సినిమాలో వారి పాత్రలకి న్యాయం చేశారు. దీపిక పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా మిగిలిన ఇద్దరు హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్ కూడా ఉండేలా చూసుకున్నారు. కానీ కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి.

umair sandhu review on pathaan movie

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • యాక్షన్ సీన్స్
  • పాటలు
  • నిర్మాణ విలువలు
  • లొకేషన్స్

మైనస్ పాయింట్స్:

  • నిడివి ఎక్కువగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ :

4/5

ట్యాగ్ లైన్ :

సినిమా ట్రైలర్ చూశాక ఎలా ఉండబోతోంది అనే అంచనాలు అందరిలో ఇంకా పెరిగాయి. ఎన్ని అంచనాలతో వెళ్లినా కూడా సినిమా అస్సలు నిరాశపరచదు. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అందరూ చూడగలిగేలా ఈ సినిమాని రూపొందించారు. గత కొంత కాలంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ సినిమాల్లో ఒకటిగా పఠాన్ సినిమా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like