ఇంటీరియర్ డిజైనర్ గా షారుఖ్ ఖాన్ భార్య ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? అంబానీ ఇంటికి కూడా ఆమె.!

ఇంటీరియర్ డిజైనర్ గా షారుఖ్ ఖాన్ భార్య ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? అంబానీ ఇంటికి కూడా ఆమె.!

by Harika

Ads

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాల ద్వారానే కాకుండా కమర్షియల్ యాడ్స్ ద్వారా, ఇంకా సైడ్ బిజినెస్ ల ద్వారా చాలా సంపాదిస్తూ ఉంటారు. అయితే వారి భార్యలు కూడా భర్తలకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సంపాదిస్తూ ఉంటారు. ఆ విషయం చాలామందికి తెలియదు. బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోల భార్యలు వారి భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తారు అనేది నమ్మలేని నిజం. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ గౌరీఖాన్. ఇంతకీ ఆమె మరెవరో కాదు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వైఫ్.

Video Advertisement

ఆమె ఒక సక్సెస్ఫుల్ ఇంటీరియర్ డిజైనర్. అంతేకాదు ఒకపక్క తన భర్త కెరీర్ కు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూనే మహిళ వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు గౌరీ ఖాన్. ఇంటీరియర్ డిజైనర్ గా ఆమె జర్నీ ఏమిటో చూద్దాం. నిజానికి ఆమె డిగ్రీ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. తర్వాత తండ్రిది గార్మెంట్స్ వ్యాపారం కావడంతో టైలరింగ్ లో కూడా ప్రావీణ్యం పొందింది. అయితే షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ల ఇల్లు మన్నాత్ బంగ్లా నిర్మించి చాలా సంవత్సరాలు కావడంతో దానిని రీ మోడలింగ్ చేయాలనుకున్నారు షారుక్.

ఆ తరుణంలోనే గౌరీ ఖాన్ కి ఇంటీరియర్ డిజైనింగ్ పై మక్కువ ఏర్పడింది. అంతేకాదు ఆ ఇంటిని అత్యంత సుందరంగా మలుచుకోవడం కోసం ప్రముఖ ఆర్కిటెక్చర్లతో కలిసి పని చేసింది. అలా ఆమెకు తెలియకుండానే ఇంటీరియర్ డిజైనర్ గా మారిపోయారు. తమ విలాసవంతమైనా బంగ్లా మన్నాత్ ని ఎంత అందంగా తీర్చిదిద్దంటే అదొక అద్భుతమైన ప్యాలెస్ అన్న రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ ఏకంగా 200 కోట్లు.

ఆ తర్వాత ఆమె పూర్తిస్థాయిలో ఇంటీరియర్ డిజైనర్ గా మారిపోయారు. తర్వాత ఈ రంగంలో మెలకువలు కూడా నేర్చుకున్నారు. 2013లో గౌరీఖాన్ డిజైన్స్ పేరుతో డిజైన్స్ స్టూడియో కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆమె ముఖేష్ అంబానీ, రాబర్ట్టో కావల్లి లాంటి ప్రముఖుల ఇళ్ళకు ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ చార్జ్ ఆరు లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఆమె డిజైన్స్ నెట్ వర్త్ దాదాపు రెండు కోట్ల పైన ఉంటుందని సమాచారం. ఫార్చ్యూన్ మ్యాగజైన్ 50 అత్యంత శక్తివంతమైన మహిళలలో ఆమె కూడా ఒకరుగా నిలవడం విశేషం.


End of Article

You may also like