నాచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో జెర్సీ ఒకటి. 2019 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించడం మాత్రమే కాకుండా, ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది. అందులోనూ ముఖ్యంగా నాని నటనకి అయితే జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు లభించింది. ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. స్టార్ నటుడు షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
తెలుగులో దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఇటీవల నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు నటుడు షాహిద్ కపూర్ ఈ విధంగా సమాధానం చెప్పారు. ఒక నెటిజన్ ట్విట్టర్లో షాహిద్ కపూర్ ని, “నాని గురించి ఒక మాట చెప్పండి” అని అడిగారు. అందుకు షాహిద్ కపూర్, “నాకు తెలిసి నాని జెర్సీలో చాలా బాగా నటించారు. ఆయన నటన చూసి నాకు ఏడుపు కూడా వచ్చింది. ఒక రకంగా నన్ను నాకు ఈ సినిమా చేయడానికి నాని ఇన్స్పైర్ చేశారు” అని చెప్పారు.
I think @NameisNani did an amazing job in jersey. He made me cry. So I would say he inspired me to do this film. https://t.co/OrAwHkROpd
— Shahid Kapoor (@shahidkapoor) September 27, 2021
