Home Filmy Adda “శంకర్” బాలీవుడ్ సినిమా లేనట్టేనా..? ఏం జరిగిందంటే..?

“శంకర్” బాలీవుడ్ సినిమా లేనట్టేనా..? ఏం జరిగిందంటే..?

by Mohana Priya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాతో, అలాగే రణవీర్ సింగ్ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్. ఒకవైపు తెలుగు సినిమా, మరోవైపు హిందీ సినిమా చేస్తూ, ఆ సినిమాలని పాన్-ఇండియన్ రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అలాగే సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ కూడా ఇటీవల షూట్ చేసినట్టు సమాచారం. ఆ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

shankar ranveer singh aparichitudu remake

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం శంకర్ రణవీర్ సింగ్ తో చేస్తున్న సినిమా గురించి ఒక వార్త వస్తోంది. ఈ సినిమాని ముందుగా అపరిచితుడు హిందీ రీమేక్ అని చెప్పారు. కానీ రణవీర్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, అలాగే శంకర్ కూడా 2 సినిమాలు చేస్తూ ఉండడంతో ఈ సినిమా చేసే ఆలోచనని ప్రస్తుతం పక్కన పెట్టారు అని అంటున్నారు. అయితే శంకర్ ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారు. అందులో ఒక హీరోగా సూర్య ని, మరొక హీరోగా యష్ ని అనుకుంటున్నారు. ఇందులో రణవీర్ సింగ్ కూడా ఒక హీరోగా నటిస్తారు. అంతే కాకుండా ప్రస్తుతం రణవీర్ సింగ్ కూడా హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

You may also like