Ads
తమిళ్ డైరెక్టర్ శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఫిబ్రవరి 1వ తేదీన ఒక వార్త బయటకు వచ్చింది. 2010 లో సూపర్ స్టార్ రజినీకాంత్ గారు హీరోగా నటించిన రోబో సినిమా కథ, తన కథ నుండి కాపీ చేశారు అని అరుర్ అనే ఒక రచయిత శంకర్ మీద కంప్లైంట్ ఫైల్ చేశారు.
Video Advertisement
ఈ విషయానికి సంబంధించిన విచారణలకి కోర్టు ఆదేశాల తరువాత కూడా హాజరు కాలేదు అనే కారణంగా శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు అని ఆ వార్త సారాంశం. ఈ విషయంపై డైరెక్టర్ శంకర్ స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో, తాను ఇలాంటి వార్త చూసి షాక్ కు గురయ్యానని,
తనపై ఎటువంటి వారెంట్ జారీ అవ్వలేదు అని, రిఫరెన్స్ లో ఏ వారెంట్ అయితే తన పేరుమీద కనిపిస్తుందో, అది ఆన్లైన్ కోర్టు రిపోర్టింగ్ వల్ల జరిగింది అని, అది సరి చేస్తున్నారు అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటువంటి పుకారు ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రెస్ నోట్ ని మీడియాకి పంపాలని శంకర్ కోరారు.
End of Article